రాష్ట్రంలోని టిఆర్ఎస్, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాలను మండలాలలో విస్తృతంగా నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు.హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో రాజకీయాలు ప్రేమ ఆప్యాయతతో నడిచేవని, నేడు టిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాల వల్ల కరెన్సీ నొట్లతో రాజకీయాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు చిల్లర రాజకీయాలు చేస్తూ రైతులతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు.
వరి వేసుకుంటే ఉరే అన్న సీఎం కేసీఆర్, ఇప్పుడు వరి వేసుకోకుండా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేయిల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రైతులకు అండగా ఉండాలని కోరారు.వచ్చే ఎన్నికల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరాలనే కసితో ప్రతి కార్యకర్త పని చేయాలని, వచ్చే నెల మే 6 వ తేదీన వరంగల్ లో జరగనున్న రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు ప్రతి రైతును కదిలించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు
.