మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా నటుడిగా నిర్మాతగా పలు సినిమాలలో నటించినప్పటికీ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈయన చేసే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతూ ఉంటాయి.
ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉండే నాగబాబు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు.తాజాగా తన అభిమానులతో కలిసి చిట్ చాట్ చేసిన నాగబాబుకు నెటిజన్ల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక ఈ ప్రశ్నలకు నాగబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా నాగబాబుని ప్రశ్నిస్తూ మీకు ఇప్పుడైనా, గతంలో అయినా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్నకు నాగబాబు తనదైన శైలిలో సెటైరికల్ సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ సందర్భంగా నాగబాబు సమాధానం చెబుతూ హా ఉంది… నా భార్య అంటూ సమాధానం చెప్పారు.ఈ విధంగా నాగబాబు సదరు నెటిజన్ కి అదిరిపోయే రిప్లై ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.అలాగే మరొక నెటిజన్ వరుణ్ నటించిన గని సినిమా ప్లాప్ గురించి ప్రస్తావించగా ఆయన సమాధానం చెబుతూ సినిమా జర్నీ లో హిట్ ఫ్లాప్ సర్వ సాధారణమని సమాధానం చెప్పారు.
మరొక నెటిజన్ సినిమాలో విలన్ గా ట్రై చేయొచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు… ఈ ప్రశ్నకు నాగబాబు అవకాశాలు ఇవ్వాలి కదా అంటూ సమాధానం చెప్పారు.మొత్తానికి సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.







