Kishan Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శన పొలిటికల్ విజిట్..: కిషన్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) స్పందించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శన పొలిటికల్ విజిట్ అని విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.మేడిగడ్డ బ్యారేజ్ లోప భూయిష్టంగా ఉందని ప్రాజెక్టు అథారిటీ చెప్పిందన్న కిషన్ రెడ్డి డ్యామ్ సేప్టీ అథారిటీ అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం వివరాలు ఇవ్వలేదన్నారు.

డ్యామ్ సేప్టీ అధికారులు మళ్లీ సందర్శిస్తామంటే అనుమతి ఇవ్వడం లేదన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు.నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ( National Dam Safety Authority ) ఇచ్చిన నివేదికనే రాష్ట్ర విజిలెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు.అదే నివేదికను రీ టైప్ చేసి పంపారు తప్ప కొత్తగా ఏమీ లేదని చెప్పారు.

Advertisement

ఇప్పటికే మేడిగడ్డను అధికారులు, మంత్రులు, రాహుల్ గాంధీ( Rahul Gandhi ) చూసి వచ్చారన్న కిషన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.

కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు