భూమా కుటుంబంలో రాజకీయ రగడ..!!

మాజీ మంత్రి భూమా( Bhuma Nagi Reddy ) కుటుంబంలో రాజకీయ రగడ కొనసాగుతోంది.భూమా అఖిలప్రియ( Bhuma Akhila Priya ) కేవలం డబ్బు కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యుడు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జ్ భూమా కిశోర్ రెడ్డి ఆరోపించారు.

ఈసారి ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా బరిలో దిగనున్నట్లు తెలిపారు.భూమా కుటుంబం అంతా తనకే మద్దతు ఇస్తోందన్నారు.ఈ క్రమంలోనే బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు.

ఒకవేళ పార్టీ అధిష్టానం సీటు ఇవ్వనిపక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.భూమా కుటుంబ వారసత్వం తనకే ఉందన్న కిషోర్ రెడ్డి అఖిలప్రియ( Bhuma Kishore Reddy ) ఇంటి పేరు భూమా కాదని, మద్దూరు అని తెలిపారు.

ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియకు గాని, ఆమె భర్తకు గాని ఆళ్లగడ్డతో సంబంధం లేదని వెల్లడించారు.తాజాగా కిశోర్ రెడ్డి వ్యాఖ్యలు భూమా కుటుంబంలో వివాదాస్పదంగా మారాయి.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు