'పొలిమేర 2' క్లోసింగ్ కలెక్షన్స్..నిర్మాతకి జాక్పాట్ అంటే ఇదే!

ఈ ఏడాది పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి.

బయ్యర్స్ కి మరియు నిర్మాతలకు అత్యధిక లాభాలు ఈ ఏడాది చిన్న సినిమాల వల్లే వచ్చాయి.

అలా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చి కాసుల కనకవర్షం కురిపించిన చిత్రాలలో ఒకటి మా ఊరి పొలిమేర 2( Maa Oori Polimera 2 movie )లాక్ డౌన్ సమయం లో డైరెక్ట్ ఓటీటీ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా కి సీక్వెల్ గా పొలిమేర 2 వచ్చింది.ఆసక్తికరమైన ట్విస్టులతో మంచి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

కానీ ప్రొడక్షన్ విలువలు మాత్రం చాలా చీప్ గా ఉందని, కాస్త పెద్ద బడ్జెట్ తో రిచ్ గ్రాఫిక్స్ తో సినిమా తీసి ఉంటె మరో లెవెల్ లో ఉండేది అని టాక్ కూడా వినిపించింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ నిన్నతో దాదాపుగా పూర్తి అయ్యినట్టే అని చెప్పాలి.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా మూడు కోట్ల 40 లక్షల రూపాయలకు జరిగింది.మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిన ఈ చిత్రం మొదటి వారం లో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

Advertisement

అంటే దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగానే లాభాలు అన్నమాట.ఆ తర్వాత వసూళ్లు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి.ఓవరాల్ గా ఇప్పుడు ఈ చిత్రానికి క్లోసింగ్ లో దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట.

అంటే జరిగిన బిజినెస్ కి మూడింతలు లాభాలు వచ్చాయి.నిర్మాత కి మరియు బయ్యర్స్ కి జాక్పాట్ తగిలింది అనే చెప్పొచ్చు.

కేవలం సీక్వెల్ తో సరిపెట్టే స్టోరీ కాదని, మొత్తం 5 భాగాలూ ఉంటాయని డైరెక్టర్( Director ) చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

డబ్బులు బాగా వచ్చాయి కాబట్టి ఈసారి అయిన కక్కుర్తి పడకుండా మంచి క్వాలిటీ తో సినిమాని తియ్యాలంటూ సోషల్ మీడియా లో ( Social media )నెటిజెన్స్ నిర్మాతలను ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ఓటీటీలో( OTT ) వచ్చే నెల 10 వ తారీఖున డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం.థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు