విజయ్ దేవరకొండ ఫాన్స్ పై లాఠీ దెబ్బ  

Police Lathicharge On Vijay Devarakonda Fans-

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎ హీరోకి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ కుర్ర హీరో విజయ్ దేవరకొండ కి ఉంది.రెండేళ్ళ క్రితం వరకు వేరొక హీరోని చూడటానికి ఆత్రుతగా ఎదురుచూసే విజయ్ దేవరకొండని ఇప్పుడు ఫాన్స్ చూడటానికి ఆత్రుతగా ఎగబడుతున్నారు.అతని స్టైల్, యాటిట్యూడ్ కి యూత్ విపరీతంగా కనెక్ట్ అయిపొయింది..

Police Lathicharge On Vijay Devarakonda Fans--Police Lathicharge On Vijay Devarakonda Fans-

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉండి మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగేస్తున్నాడు.తాజాగా డియర్ కామ్రేడ్ పేరుతో బెంగుళూరు లో మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించారు.ఈ లైవ్ ఈవెంట్స్ లో విజయ్ దేవరకొండ ఫాన్స్ ని నేరుగా కలిసి ముచ్చతిస్తుననాడు.

తాజాగాబెంగుళూరు లో జరిగిన ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ని కలవడానికి విపరీతంగా ఫాన్స్ వచ్చేసారు.ఇక వారిని కంట్రోల్ చేయడం నిర్వాహకుల వలన కూడా కాలేదు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేసారు.

దీనిలో చాలా మంది ఫాన్స్ కి దెబ్బలు తగిలాయి.అయితే ఈ ఘటన మీద విజయ్ దేవరకొండ నిర్వాహకుల మీద సీరియస్ అయ్యాడు.ఈ లాఠీ ఛార్జ్ లో ఓ యంగ్ లేడీ ఫ్యాన్ తీవ్రంగా గాయపడింది.

ఆమె ముఖంపై ఎర్రగా బొబ్బలు తేలిపోయి కనిపించింది.దీంతో ఈ ఫ్యాన్ వద్దకు వచ్చి ఓదారుస్తూ దేవరకొండ సైతం చాలానే కంగారు పడి నిర్వాహకుల మీద సీరియస్ అయ్యాడు.ప్రస్తుతం ఈ వీడియోలు జోరుగా వైరల్ అవుతున్నాయి.