ఎన్టీఆర్ జిల్లాలో బ్యాంక్ అధికారులు,సబ్ రిజిస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట: బ్యాంకుకు తాకట్టు పెట్టని స్థలాన్ని ఈ - ఆక్షన్ లో అమ్మివేసిన జగ్గయ్యపేట నందిగామ ఎస్బిఐ మేనేజర్లపై కేసు నమోదు చేసినట్లు జగ్గయ్యపేట ఎస్సై బీవీ రామారావు తెలిపారు.పట్టణంలోని మార్కండేయ బజార్లో 1.

47 నంబర్ లో గల బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి పట్నంలో ముక్త్యాల రోడ్డుకు చెందిన దేవరపల్లి జాన్ పాల్ కు 2015లో ఎస్ బి ఐ రుణం ఇచ్చింది.నిర్మాణం పూర్తయ్యాక యజమాని జాన్ పాల్ గృహవాస్తు కోసం భవనానికి అనుబంధంగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి టాయిలెట్ల నిర్మాణాన్ని చేశారు.

కరోనా నేపథ్యంలో రుణం చెల్లించలేదని ఎస్ బి ఐ ఆ భవనాన్ని ఈ ఆక్షన్ లో కర్నాటి కరుణాకర్ అనే వ్యక్తికి అమ్మేసింది.తాకట్టు లో లేని తన స్థలాన్ని కూడా రుణం ఇచ్చిన భవనంతో కలిపి అమ్మేయటంపై యజమాని జాన్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి, స్థానిక అదనపు జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ప్రాథమిక ఆధారాలు ప్రకారం నందిగామ ఎస్ బి ఐ చీఫ్ మేనేజర్, జగ్గయ్యపేట ఎస్ బి ఐ మేనేజర్, ఇంటిని కొలుగోలు చేసిన కరుణాకర్, యజమాని స్థలాన్ని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసిన జగ్గయ్యపేట సబ్ రిజిస్టర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.ఈ మేరకు వారిపై 420,378 ఎస్సీ ఎస్టీ పిఏఓ చట్టప్రకారం (Cr.no.335/2022 .13/10022) కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

తాజా వార్తలు