వైరల్: గాలిలో విమానాలు ఢీ.. ఎయిర్ షోలో ప్రమాదం..

తాజాగా దక్షిణ పోర్చుగల్‌లో( South Portugal ) జరిగిన ఎయిర్‌షోలో ప్రమాదం చోటు చేసుకుంది.ఎయిర్ షోలో( Air Show ) పాల్గొన్న విమానాలలు ప్రమాదానికి గురయ్యాయి.

 Planes Collide Mid-air At Portugal Beja Air Show Video Viral Details, Social Med-TeluguStop.com

ఈ ఎయిర్ షోలో మొత్తం ఆరు విమానాలు పాల్గొనగా అందులో మనం సాంకేతిక లోపం కారణంగా మరో విమానంను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ఓ పైలట్ మరణించాడు.

మరో పైలెట్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

బెజాలో ( Beja ) జరిగిన ఈ ఎయిర్ షోలో మొత్తం 6 విమానాల పాల్గొన్నాయి.అందులో ఓ విమానం కింది నుంచి పైకి వెళ్తున్న సమయంలో పైన వెళ్తున్న ఐదు విమానాలలో ఒక విమానాన్ని తాకగా దాంతో రెండు విమానాలు నేలకులాయి.ఈ దుర్ఘటన సందర్భంగా ఒక పైలెట్ మరణించగా.మరో పైలెట్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు.

పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్‌ స్టార్స్‌’( Yakstars ) అనే ఏరోబాటిక్‌ గ్రూప్‌ సంస్థ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది.ఈ ప్రదర్శనలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్‌ యాక్‌-52 రకానికి చెందినవిగా సమాచారం.ఇక పైలట్‌ స్పెయిన్‌ కు చెందిన వ్యక్తి మరణించగా.గాయపడిన పైలట్‌ పోర్చుగల్‌ దేశానికి చెందిన పౌరుడు.ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube