సింగపూర్‌లో అరిస్తే చాలు.. ఫ్రీగా ఐస్‌క్రీమ్‌లు వచ్చేస్తాయి...??

సింగపూర్‌లోని( Singapore ) మెక్‌డొనాల్డ్స్( McDonald’s ) ఒక క్రేజీ ఆఫర్‌ లాంచ్ చేసింది! ఈ కంపెనీ ఉచిత హెర్షేస్ చాక్లెట్ ఐస్‌క్రీం ఆఫర్ చేస్తోంది.కానీ, దాని కోసం మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.

 Mcdonald Singapore New Campaign Is Making People Scream For Free Ice Creams Deta-TeluguStop.com

ఐస్‌క్రీం షాప్ బయట ఒక పెద్ద వానిల్లా ఐస్‌క్రీం కోన్‌ ఉంటుంది.ఆ చాక్లెట్ ఐస్‌క్రీం కావాలంటే, గట్టిగా అరవాలి.

మీ అరుపుకి స్క్రీన్‌పై వానిల్లా ఐస్‌క్రీం చాక్లెట్‌గా( Vanilla Ice Cream Chocolate ) మారిపోతే, మీకు ఉచితంగా చాక్లెట్ ఐస్‌క్రీం వచ్చేస్తుంది! “బోర్‌ కొడుతోందా? చాక్లెట్ కోసం అరవండి” అనేది ఈ ఆఫర్‌ ట్యాగ్‌లైన్.

ఫన్నీ ఆఫర్ కోసం చాలా మంది లైన్‌లో నిలబడుతున్నారు.

స్థానికులతో పాటు, టూరిస్టులు కూడా అరుపులు అరుస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఉచితంగా ఏదో దొరుకుతుందని తెలిస్తే, ఏం చేసినా ఫర్వాలేదని అనుకుంటారు కదా, అందుకే ఈ ఆఫర్ ఇంత సక్సెస్ అవుతోంది!

మెక్‌డొనాల్డ్స్ ఆఫర్‌కి( McDonald’s Offer ) ఆన్‌లైన్‌లో రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి.కొంతమంది ఈ ఆలోచన చాలా బాగుందని, కస్టమర్లతో మాట్లాడేందుకు ఇది ఒక ఫన్నీ మార్గమని మెచ్చుకుంటున్నారు.కానీ, మరికొందరు ఈ అరుపులు ( Scream ) చాలా గందరగోళంగా ఉంటాయని, దృష్టి మరల్చడానికి కారణమవుతాయని భయపడుతున్నారు.

ఒక సోషల్ మీడియా యూజర్ ఈ ఆఫర్ చాలా బాగుందని, కానీ చాలా ఎక్కువగా డిస్టబెన్స్ అవుతుందని కూడా చెప్పాడు.

మొత్తం మీద, ఈ ఆఫర్‌తో మెక్‌డొనాల్డ్స్ ఒక పెద్ద సాహసమే చేసిందని చెప్పుకోవాలి.ఉచిత వస్తువులపై మనకున్న ఆసక్తిని ఈ ఆఫర్ వాడుకుంది, దానికి హాస్యం, ఇంటరాక్టివిటీని కూడా జోడించింది.ఇది నచ్చుతుందా, నచ్చదా అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం, కానీ ఖచ్చితంగా ఇది ఒక భిన్నమైన ప్రకటన విధానం.

కొత్తదనం వల్లే ఈ ఆఫర్‌ ఒక మంచి విజయం సాధిస్తుందని మెక్‌డొనాల్డ్స్ ఆశిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube