వైరల్: గాలిలో విమానాలు ఢీ.. ఎయిర్ షోలో ప్రమాదం..

తాజాగా దక్షిణ పోర్చుగల్‌లో( South Portugal ) జరిగిన ఎయిర్‌షోలో ప్రమాదం చోటు చేసుకుంది.

ఎయిర్ షోలో( Air Show ) పాల్గొన్న విమానాలలు ప్రమాదానికి గురయ్యాయి.ఈ ఎయిర్ షోలో మొత్తం ఆరు విమానాలు పాల్గొనగా అందులో మనం సాంకేతిక లోపం కారణంగా మరో విమానంను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఓ పైలట్ మరణించాడు.మరో పైలెట్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.

ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే. """/" / బెజాలో ( Beja ) జరిగిన ఈ ఎయిర్ షోలో మొత్తం 6 విమానాల పాల్గొన్నాయి.

అందులో ఓ విమానం కింది నుంచి పైకి వెళ్తున్న సమయంలో పైన వెళ్తున్న ఐదు విమానాలలో ఒక విమానాన్ని తాకగా దాంతో రెండు విమానాలు నేలకులాయి.

ఈ దుర్ఘటన సందర్భంగా ఒక పైలెట్ మరణించగా.మరో పైలెట్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు.

"""/" / పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన పైలట్లతో కూడిన 'యాక్‌ స్టార్స్‌'( Yakstars ) అనే ఏరోబాటిక్‌ గ్రూప్‌ సంస్థ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది.

ఈ ప్రదర్శనలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్‌ యాక్‌-52 రకానికి చెందినవిగా సమాచారం.ఇక పైలట్‌ స్పెయిన్‌ కు చెందిన వ్యక్తి మరణించగా.

గాయపడిన పైలట్‌ పోర్చుగల్‌ దేశానికి చెందిన పౌరుడు.ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

తాజ్ మహల్ ప్యాలెస్‌లో టీ తాగిన మధ్యతరగతి వ్యక్తి.. ఆ టీ ధర తెలిస్తే..?