ఫోన్ పే వినియోగదారులకు ఇకపై ఆ ఛార్జీలు..బాదుడే బాదుడు

ఇండియాలో ఫోన్ పే అంటే తెలియని వారు ఉండరు.భారతదేశంలో ఇదొక పెద్ద యూపిఐ వేదిక.

చాలా మంది దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్ పే ద్వారా చెల్లింపుల నుంచి మనీ ట్రాన్స్‌ఫర్, బిల్లుల చెల్లింపు వరకు అనేక సేవలు అందుబాటులో ఉంటాయి.

అందుకే ఫోన్ పే ను చాలా మంది వాడుతుంటారు.ఎక్కడి నుంచైనా ఎవ్వరికైనా ఈ ఫోన్ పే ద్వారా సులభంగా డబ్బులు పంపించవచ్చు.

అయితే ఈ ఫోన్ పే తమ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.ఫోన్ పే ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది.తమ వినియోగదారుల వద్ద రూ.50 నుంచి రూ.100లోపు రీఛార్జీ చేసుకుంటే 1 రూపాయిని ఫోన్ పే వసూలు చేయనుంది.అంతేకాకుండా రూ.100 కంటే ఎక్కువగా రీఛార్జీ చేసుకుంటే రూ.2ల ఫీజును ఫోన్ పే వసూలు చేసేందుకు సిద్దమైంది.ఇప్పటి వరకూ ఇవంతా కూడా ఎటువంటి ఫీజు లేకుండా సేవలు అందేవి.

Advertisement

అయితే ఇకపై ఇటువంటి ఫీజులను ఫోన్ పే వసూలు చేయనుంది.ప్రమోషన్ల కోసం ఇప్పటికే సగానికి పైగా ఛార్జీలను తగ్గించిన ఫోన్ పే ప్రస్తుతం ఈ ఛార్జీలను అమలు చేసేందుకు సిద్దమైంది.

ఓ సరికొత్త ప్రయోగంలో భాగంగా కొంత మంది ఎంపిక చేసిన యూజర్ల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఫోన్ పే ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

అయితే కొంత మందికి మాత్రమే వసూలు చేయాలా లేకుంటే ఎక్కువ మందికి ఈ ఛార్జీలు వసూలు చేయాలా అనేదానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఫోన్ పే తెలిపింది.గతవారంలో ఫోన్ పే 44% అంటే సుమారుగా రూ.888 కోట్లు నష్టాలపాలైంది.ఆ టైంలోనే రెవెన్యూ 84%కి అంటే రూ.690 కోట్లు పెరగడం విశేషం.ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో ఫోన్ పేలో రూ.165 కోట్ల లావాదేవీలు జరిగాయి.ఫోన్ పే తర్వాత గూగుల్ పే ఉంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు