ఏపీ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు తన పదవీకాలం ముగియడంతో గవర్నర్ కి లెటర్ రాయడం జరిగింది.ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రాసిన లెటర్ పై పేర్ని నాని సెటైర్లు వేశారు.
తాడేపల్లి లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.నిమ్మగడ్డ రమేష్ కుమార్ శ్రీరంగనీతులు లెటర్ ఒకటి రిలీజ్ చేశారు, అది ఓ పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్లు ఉంది అన్నట్టు కామెంట్లు చేశారు.

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఆ లెటర్ లో నిమ్మగడ్డ మాట్లాడటం విచిత్రంగా ఉందని అన్నారు.బరితెగింపు నిర్లక్ష్య వ్యవహారశైలి నిమ్మగడ్డ ది అంటూ మండిపడ్డారు.రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ అప్పట్లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి రాజకీయ నాయకులతో హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరపటం దేనికి సంకేతం, అటువంటి వ్యక్తి ఎస్ఈసీ రాజకీయ నాయకులతో దూరంగా ఉండాలని సూచనలు ఇస్తూ లెటర్ రాయడం సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు.నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం చంద్రబాబు డైరెక్షన్ లోనే పనిచేశారని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైన లెటర్ పైన సంతకం పెట్టి కేంద్రానికి లెటర్ రాసిన వ్యక్తి నిమ్మగడ్డ అంటూ మండిపడ్డారు.ఇంకా అనేక విషయాల పై విమర్శలు చేస్తూ అటువంటి వ్యక్తి శ్రీరంగ నీతులు చెబుతూ లెటర్ రాయడం హాస్యాస్పదం అంటూ మంత్రి పేర్ని నాని సీరియస్ కామెంట్లు చేశారు.