హ్యాపీ బర్త్ డే శ్రీలీల.. ఈమె గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.

ఈమె చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిందనే చెప్పాలి.

ఈమె అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి. శ్రీలీల రాఘవేంద్రరావు పర్వేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టింది.

ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.

ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతుంది.

Advertisement

ఇలా క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ బ్యూటీ ఈ రోజు పుట్టిన రోజును జరుపు కుంటుంది.ఈ క్రమంలోనే ఈమె ఏజ్ గురించి చాలా మందికి తెలియదు.

రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ ఈమె కరెక్ట్ ఏజ్ ఎంత అంటే ఎవ్వరు చెప్పలేక పోతున్నారు.మరి ఈ క్రేజీ బ్యూటీ ఏజ్ ఎంతో మీకు తెలుసా.

ఎంత అంటే.ఈ అమ్మడి వయసు కేవలం 20 ఏళ్ళు మాత్రమే.

చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా టాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అలాగే మిగతా ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ లకు సైతం సవాల్ విసురుతుంది.ఈమె నటన, అందం, అందాల ఆరబోతలో కూడా అభ్యంతరం చెప్పకపోవడం వంటివి ఈమెకు ప్లస్ అయ్యాయి.ప్రెసెంట్ ఈమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Advertisement

ఈ సినిమాలు రిలీజ్ అయితే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం.మరి వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ అవ్వాలని మనం కోరుకుందాం.

తాజా వార్తలు