డైరెక్టర్ రమేష్ రాపర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా మాయపేటిక.( Mayapetika Movie ) ఇందులో పాయల్ రాజ్ పుత్, ( Payal Rajput ) సునీల్,( Sunil ) పృథ్విరాజ్, యాంకర్ శ్యామల, హిమజ, విరాజ్ అశ్విన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు.
ఈ సినిమాను మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు.గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు.
సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా కామెడీ, లవ్, టెర్రరిజం వంటి నేపథ్యంలో తెరకెక్కింది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.అయితే ఈ రోజు నుండి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే ఈ సినిమా సెల్ ఫోన్ నేపథ్యంలో రూపొందింది.ఇక ఇందులో పాయల్ రాజ్ పుత్ ఫోన్ పోతుంది.
ఆమెకు ఒక నిర్మాత ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తాడు.అయితే ఆ ఫోన్ వల్ల తన కాబోయే భర్తతో తనకు గొడవలు వస్తాయి.
దీంతో ఆ ఫోనును అసిస్టెంట్ కి ఇస్తుంది.అలా ఆ ఫోను అతడి చేతి నుంచి పలువురి చేతుల మీద మారి పాకిస్తాన్ కి వెళ్తుంది.
అయితే ఫోన్ వల్ల కార్పొరేటర్ కన్నే కామేశ్వరరావు (పృథ్వీరాజ్ ) జైలుకు వెళ్తాడు.అలా రాజపుత్ ఫోన్ చివరికి ఏమవుతుంది.
పృథ్వీరాజ్ కు ఫోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి.మిగిలిన పాత్రలకు ఫోన్ లతో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది మిగిలిన స్టోరీలోనిది.

నటినటుల నటన:
పాయల్ రాజ్‌పుత్ తన పాత్రలో బాగా చేసింది.పృథ్వీరాజ్ తన కామెడీతో నవ్వించాడు.ఇక సునీల్, శ్యామల కూడా అద్భుతంగా నటించారు.సిమ్రత్ కౌర్, విరాజ్ అశ్విన్ మిగిలిన నటినటులు తమ పాత్రకు తగ్గట్టు చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ రమేష్. కథను రీసెర్చ్ చేసినట్లు అనిపించిన కూడా చూపించడంలో కాస్త వెనుకబడ్డాడని చెప్పాలి.
సురేష్ రగుతు కెమెరా వర్క్ బాగుంది.ఇక పాటలు అంతంత అన్నట్లు మాత్రమే ఉన్నాయి.
మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టు పనిచేశాయి.

విశ్లేషణ:
ఈ సినిమా ఒక సెల్ ఫోన్ నేపథ్యంలో రూపొందింది.డైరెక్టర్ ఈ సినిమాలో మొత్తం ఆరు కథలను చూపించాడు.ఒక కథకు మరో కథకు అసలు సంబంధం అనేది ఉండదు.
అందులో కొన్ని సీన్స్ మాత్రం పర్వాలేదు అన్నట్లుగా ఉండగా మరి కొన్ని సీన్స్ చాలా బోరింగ్ గా అనిపించాయి.కామెడీ కూడా అంతగా నవ్వించలేదని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
అక్కడక్కడ కామెడీ పర్వాలేదు అన్నట్లుగా అనిపించింది.సినిమాటోగ్రఫీ బాగుంది.

మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు ఆసక్తిగా అనిపించలేదు.సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాను ఒకసారి మాత్రం చూడవచ్చని చెప్పాలి.