తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ లో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మోదీకి ప్రశ్నలు వేశారు.
తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పాకే వరంగల్ లో మోదీ అడుగు పెట్టాలని తెలిపారు.
ములుగు జిల్లాలో ట్రైబల్ వర్సిటీ ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఎందుకు చేతులు ఎత్తేశారో చెప్పాలన్నారు.కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విభజన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలని పేర్కొన్నారు.ఇది ఎన్నికల సీజన్ అన్న కేటీఆర్ కొత్త కొత్త వాళ్లు వస్తారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి గడ్డి అయినా తింటారని విమర్శించారు.







