వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసి కూడా అంటూ పవన్ షాకింగ్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ "వారాహి విజయ యాత్ర"( Varahi Vijayatra )లో చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.

జూన్ 14 నుండి ఉభయగోదావరి జిల్లాలలో సాగుతున్న వారాహి యాత్రలో పవన్ వైసీపీ ( YCP )ప్రభుత్వాన్ని మరియు నాయకులను టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇదే సమయంలో ప్రజా సమస్యల విషయంలో నిలదీస్తూ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసే మేలులను వివరిస్తున్నారు.ఇదిలా ఉంటే బుధవారం ముమ్మిడివరంలో నిర్వహించిన "వారాహి విజయ యాత్ర" బహిరంగ సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మళ్లీ వచ్చే ఎన్నికలలో ఓడిపోయినా గాని.నిలబడే ఉండాలి అని సిద్ధపడి గొడవ పెట్టుకుంటున్నానని అన్నారు.కీడెంచి మేలు కోరాలని తన తండ్రి తనతో చెప్పారని.

మరోసారి ఓడిపోతానని నిర్ణయించుకునే ఈ వైసీపీ క్రిమినల్ గ్యాంగ్ తో గొడవ పెట్టుకుంటున్నట్లు స్పష్టం చేశారు.ఇది నిరంతరం సాగే పోరాటం అని పేర్కొన్నారు.

Advertisement

తనకి "జెడ్" క్యాటగిరి సెక్యూరిటీ ఉండదు, "వై" కేటగిరి సెక్యూరిటీ ఉండదు, పోయినసారి "వై" క్యాటగిరి సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వెనక్కి పంపించినట్లు పవన్ స్పష్టం చేశారు.తనకి సెక్యూరిటీ భయం లేదని వారాహియే.

రక్షణ అని స్పష్టం చేశారు.ఎన్నికల్లో గెలిచిన ఓడిపోయిన ప్రజా పోరాటాల విషయంలో నిరంతరం పోరాడతానని ముమ్మిడివరం సభలో పవన్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు