వైసీపీ ఉప్మా ప్రభుత్వం అంటూ.. సంక్షేమ పథకాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

ముమ్మిడివరం వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.రాష్ట్రంలో 70 శాతం ప్రజలు.

వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు.సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్( CM Jagan ) 100 మంది కష్టాన్ని 30, 40 మందికి పంచుతున్నారని అన్నారు.

వైసీపీ ( YCP )అనేది ఉప్మా ప్రభుత్వం అని సెటైర్లు వేశారు.తమ వాడని నమ్మి వైయస్ జగన్ కి ఓటు వేసిన రైతులు.

ఇప్పుడు ఎంతగానో బాధపడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు.ఇటీవల అకాల వర్షాల కారణంగా.

Advertisement

నష్టపోయిన రైతులకు ప్రభుత్వం కేవలం డబ్బులు చెల్లించడానికి కారణం జనసేన అని అన్నారు.

అకాల వర్షాల కారణంగా కొద్ది రోజుల క్రితం పంట నష్టపోయిన రైతులను పలకరించడానికి తాను వస్తున్నానని తెలిసి ప్రభుత్వం హుటాహుటిన రైతుల ఎకౌంటు లోకి డబ్బులు వేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ ప్రభుత్వానికి భయమని స్పష్టం చేశారు.  చట్టసభలలో బలం లేకపోయినా గాని ప్రజల తరఫున పోరాడుతున్నాం.

రాబోయే ఎన్నికలలో జనసేన( janasena ) పార్టీకి అండగా ఉంటే.రైతులకు అనీ వర్గల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ ముమ్మిడివరం వారాహి సభలో వ్యాఖ్యానించారు.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు