కమల్ ఓటమితో పవన్  కంగారు ?  

రాజకీయాల్లో రాజకీయం తప్ప సినీ గ్లామర్ కేవలం కొంత వరకు మాత్రమే పనిచేస్తుందనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో తెలుసుకున్నారు.

అయినా సరైన పొలిటికల్ బ్రేక్ రాక, పొత్తు పెట్టుకున్న పార్టీలకు బలం లేకపోవడం ఇలా ఎన్నో కారణాలతో అధికారం అందని ద్రాక్షగానే పవన్ కు ఉంటూ వస్తోంది.

అయితే ఎప్పటికైనా ఏపీలో అధికారంలోకి వస్తామని, సీఎం కుర్చీలో కూర్చుంటాము అనే ధీమా పవన్ లో కనిపిస్తోంది.అయినా ఏదో తెలియని భయం నెలకొంది.

  కాకపోతే తమిళనాడులో జరిగిన ఎన్నికలలో సినీ హీరో కమల్ హాసన్ పార్టీ పెట్టి స్వయంగా ఆయన ఎన్నికల బరిలోకి దిగారుు.కానీ ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి.

కమల్ తో పాటు ఆ పార్టీ తరఫున పోటీ చేసి నాయకులందరూ ఓటమి చెందారు.దీంతో  పవన్  కమల్ మధ్య పోలిక ప్రారంభమైంది.

Advertisement

జనాల్లో బాగా చైతన్యం , పెరిగిందని,    సినీ అభిమానం అక్కడిి వరకే చూపిస్తున్నారు  తప్ప రాజకీయాల్లో సినీ గ్లామర్ పనిచేయదు అనే విషయం కమల్ పార్టీ ఓటమితో  తేలిపోయింది.దీంతో ఇప్పుడు పవన్ సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది .2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ కి వెళ్లి ఘోరంగా దెబ్బతిన్నామని, సినీ గ్లామర్ తో పాటు, సామాజిక వర్గం బలం తనకు పెద్దగా లభించలేదనే విషయాన్ని పవన్ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.అందుకే ప్రధాన పార్టీల మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి  పరాజయం పాలయ్యే కంటే, తమకు బలమున్న  నియోజకవర్గాల్లో మాత్రమే పోటీకి దిగాలని ఆలోచనతో పవన్ ఉన్నారట.

కనీసం జనసేన పార్టీకి 50, 60 స్థానాలు దక్కితే తప్పకుండా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న వారికి తమ మద్దతు అవసరం అవుతుందని, జనసేన డిమాండ్ బాగా పెరుగుతుందని, అవసరమైతే ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండున్నర సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం పొందవచ్చు అనే ఆలోచనతో పవన్ ఉన్నారట.ఇదంతా కమల్ హాసన్ తో పాటు,  ఆయన పార్టీ అభ్యర్థులను ఓటమి చెందిన తరువాత పవన్ లో కలిగిన అభిప్రాయంగా తెలుస్తోంది.  అయితే ప్రస్తుతం బిజెపితోో పొత్తు పెట్టుకున్నన జనసేన రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో  పొత్తు పెట్టుకునే ఆలోచన లో ఉంది.

బీజేపీ తో అయినా టీడీపీతో అయినా తాము స్థానాలను మాత్రమే తీసుకుని పోటీకి దిగాలని అలాగే ఒంటరిగా పోటీ చేసినా ఇదే విధంగా ముందుకుుు వెళ్లాలని  పవన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024
Advertisement

తాజా వార్తలు