పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అంటే ఎంత ఫాలోయింగ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు టాలీవుడ్ లో ఎవ్వరికి లేనంత సాధ్యం కానీ అంత ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి.
అందుకే పవర్ స్టార్ సినిమా ఓపెనింగ్స్ రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి.ఈయన సినిమా ప్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం బాగా వస్తాయి.
ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈయన పేరు చెప్పగానే అదిరిపోయే స్టైలిష్ లుక్స్ మాత్రమే కాదు.
అంతకంటే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా గుర్తుకు వస్తాయి.
గతంలో పవన్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ లు కొత్తగా, యూనిక్ గా ఉండేవి.అందుకే ఈయన సినిమాల్లో యాక్షన్ బ్లాక్ కోసం ఆడియెన్స్ ఎదురు చూసే వారు.
అయితే ఈ మధ్య కాలంలో అలాంటి యూనిక్ ఫైట్స్ పవన్ కళ్యాణ్ తక్కువుగానే చేసారు అని చెప్పాలి.

అందుకే ఈసారి పవన్ కొత్తగా నటిస్తున్న సినిమాలో అప్పటి యూనిక్ స్టైల్ అండ్ ఫైట్స్ ఇప్పుడు తీసుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ‘‘ఓజి” ( OG Movie ) ఒకటి.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ( Director Sujeeth ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు సమాచారం
.

ఇక తాజాగా సుజీత్ పెట్టిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈ పోస్ట్ లో సుజీత్ నాన్ చక్ పట్టుకుని ఒక పెద్ద నీడలో కనిపిస్తున్నాడు.ఈ పిక్ తో ఈ సినిమాలో పవన్ మీద మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ( Martial Arts ) లో నాన్ చక్ సీక్వెన్స్ కూడా ఉంటాయని కన్ఫర్మ్ అయ్యింది.
మరి సుజీత్ కొత్తగా ఎలా పవన్ ఫైట్స్ చూపిస్తాడో ఈ సీక్వెన్స్ ఏ లెవల్లో ఉంటుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.