Pawan Kalyan : పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వైసీపీ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

మార్చి 30వ తారీకు "వారాహి విజయ భేరి" ( Varahi Vijaya Bheri ) పేరిట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలో నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ( YCP ) పార్టీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఫ్యాన్ కి గాలి ఎక్కువ సౌండ్ తక్కువని.సెటైర్ వేశారు.

దశాబ్ద కాలంగా నేను ఒంటరి పోరాటం చేస్తున్నా.నన్ను గెలిపించండి.

నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉంటాను.మీకోసం నిలబడుతున్న నన్ను ఆదరించండి.

Advertisement

నేను గెలిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని( Pithapuram Constituency ) అభివృద్ధి చేస్తా.సీఎం జగన్ అసలైన పెత్తందారుడు.

చంద్రబాబు సీఎం అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.త్వరలో ఇక్కడే ఓ ఇల్లు తీసుకోబోతున్నాను.

ప్రత్యేకమైన ఆఫీసు కూడా పెడతాను. 54 మండలాలకు సంబంధించి పార్టీ కార్యవర్గానికి బాధ్యతలు అప్పగిస్తాను.ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను.

అన్ని వర్గాల ప్రజలను నావారిగా భావిస్తాను.పిఠాపురం నా గుండెల్లో పెట్టుకుంటాను.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
'డాకు మహారాజ్ ' సినిమా ట్రైలర్ లో బాబీ చేసిన తప్పు ఏంటో తెలుసా..?

దేశంలోనే పిఠాపురం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని పవన్ స్పష్టం చేశారు.యువతకు సంబంధించి.

Advertisement

ఐదువేల జీతం కంటే పాతిక సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తాం అని హామీ ఇచ్చారు.ఈసారి జగన్ మాయమాటలకి పడిపోయి ఎవరూ ఓటు వేయొద్దు.

దశాబ్ద కాలం పాటు రాజకీయాలు చేస్తున్న.ఓడిపోతే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారు.

కానీ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇస్తున్న మద్దతు వల్లే రాజకీయాల్లో ఇంకా నిలబడ్డ.పార్టీని నడుపుతున్న అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు తీసుకొచ్చి.యువతకి ఉపాధి కలిగేలా చేస్తానని పవన్ మాట ఇచ్చారు.

కచ్చితంగా వచ్చే ఎన్నికలలో లక్ష మెజారిటీతో జనసేన పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.

తాజా వార్తలు