హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఈ క్రమంలో గద్దర్ భౌతికకాయాన్ని చూసిన పవన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

గద్దర్ కుమారుడిని కౌగిలించుకుని భావోద్వేగానికి గురై.కన్నీరు మున్నీరయ్యారు.

ఇదే సమయంలో గద్దర్( Gaddar ) కుటుంబ సభ్యులను పవన్ ఓదార్చడం జరిగింది.ఇదిలా ఉండగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంత్యక్రియలను అధికారుల లాంచనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదే సమయంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.అల్వాల్ మహాబోధి స్కూల్ గ్రౌండ్ లో( Alwal Mahabodhi School Ground ) అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో గద్దర్ భార్య విమల మహా బోధి పాఠశాలలో నిర్వహించాలని కోరడంతో ప్రభుత్వం అంగీకరించడం జరిగింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం గద్దర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో ఉంచడంతో పెద్ద ఎత్తున రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు