జనసేన అధికారంలోకి వస్తే అమలయ్యే పథకాలివే.. వాళ్లకు రూ.10 లక్షలు ఇస్తానంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలు జరగడానికి మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది.

వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో ఏ పార్టీలతో ఏ పార్టీకి పొత్తు బహిరంగంగా ఉంటుందో క్లారిటీ రావాల్సి ఉంది.

టీడీపీ, జనసేన పొత్తు అనధికారికంగా ఫిక్స్ అయినా ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చెప్పలేం.గౌరవం, మర్యాద దక్కని పక్షంలో జనసేన సింగిల్ గా పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది.

అయితే ఏపీలో జనసేన( Janasena ) డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చినా లేదా మరో పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చినా అమలు చేసే పథకాలు ఏంటనే ప్రశ్నకు పవన్ సమాధానాలిచ్చారు.పూర్తిస్థాయిలో మ్యానిఫెస్టోను ప్రకటించకపోయినా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పవన్ నిర్ణయాలు ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళతానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Advertisement

జనసేన అధికారంలోకి వస్తే కొత్త జంటకు పెళ్లి రిజిస్ట్రేషన్ తో పాటు రేషన్ కార్డ్( Ration Card ) ఇస్తామని పవన్ తెలిపారు.కొత్త దంపతులకు కొత్త ఇల్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని పవన్ చెప్పుకొచ్చారు.అర్హులందరికీ ఈ పథకాలను వర్తింపజేస్తామని పవన్ చెప్పుకొచ్చారు.

ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతను ఎంపిక చేసి 10 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామని పవన్ అన్నారు.

యూనిట్లను నెలకొల్పి ఉపాధి చూపించడం ద్వారా నిరుద్యోగ సమస్యలను దూరం చేస్తామని పవన్( Pawan kalyan ) చెప్పుకొచ్చారు.ఉచితంగా ఇస్తుకను సరఫరా చేస్తామని పవన్ పేర్కొన్నారు.అవినీతి రహిత పాలన సాగిస్తామని కేంద్రంతో సఖ్యతతో మెలిగి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా చూసుకుంటామని పవన్ చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు