పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు రామోజీ ఫిలిం సిటీలో మళ్ళీ ప్రారంభం అయ్యాయి.మూడు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడం తో షూటింగ్ ని రెండు రోజుల పాటు వాయిదా వేశారు.
ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.దర్శకుడు క్రిష్ ఈ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలను డిసెంబర్ 2వ లేదా మూడవ వారానికి ముగించే అవకాశాలు ఉన్నాయంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.

ఇక ఈ సినిమా ను కచ్చితంగా వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ఏప్రిల్ లేదా మే నెల లో విడుదల చేసి తీరుతాం అన్నట్లుగా దర్శకుడు క్రిష్ మరో సారి సన్నిహితుల వద్ద మాట్లాడాడట.దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సమ్మర్ కానుకగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రాబోతున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.హరి హర వీరమల్లు సినిమా లో మొదటి సారి పవన్ కళ్యాణ్ పీరియాడిక్ పాత్ర లో కనిపించబోతున్నాడు.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కి జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ సినిమా లో కీలక పాత్ర లో నటిస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.కీరవాణి సంగీత సారధ్యం లో రూపొందుతున్న ఈ సినిమా యొక్క పాటలు కచ్చితంగా అందరిని అలరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం తో ఉన్నారు.
ఈ సినిమా తర్వాత పవన్ సినిమాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.