అమెరికాలో రాజకేయం వేడెక్కుతోంది.2024 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు.తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విరగలేదు, పాము చావలేదు అన్నట్టుగా ఉంది ఇరు పార్టీల పరిస్థితి.ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి సిద్ధమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
మరో పక్క డెమొక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్ పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది.ఇప్పటికే వయసు మీద పడటంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న పడుతున్న అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి కష్టమే అనే వాదన కూడా వినిపిస్తోంది ఈ క్రమంలో డెమొక్రటిక్ పార్టీ తరపున బరిలోకి దిగేది ఎవరా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, ఇండో అమెరికన్ కమల హారీస్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలాఉంటే ఇదే డెమోక్రాటిక్ పార్టీ తరపు నుంచి 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటూ తెరపైకి మాజీ అధ్యక్షుడి సతీమణి మిచెల్ ఒబామా పేరు వినిపిస్తోంది.అయితే ఊహించని విధంగా మిచెల్ ఒబామా పేరు చర్చల్లోకి రావడం అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ పేరు వార్తల్లోకి రావడం పెద్ద కొత్తేమి కాకపోవచ్చు ఎందుకంటే ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే .

మిచెల్ ఒబామా ను భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నలు సంధించే వారు.అయితే అప్పట్లో మిషిన్ ఒబామా నవ్వి వదిలేసేవారు కానీ తాజాగా రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఉందా అంటూ మిచెల్ ను విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈసారి ఆమె స్పందించారు.వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ చక్కగా పాలిస్తున్నారని తాను పోటీ చేసే అవసరం లేదని తేల్చి చెప్పారు అయితే బిడెన్ రెండోసారి అధ్యక్షుడిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకు మాత్రం మిచెల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు.
బిడెన్ పోటీ చేయటం , చేయకపోవటం ఆయనకు ఆయనకు, ఆయన కుటుంబానికి సంబంధించిన విషయమని, ఈ విషయంలో తన నిర్ణయం అవసరం లేదని తెలివిగా తప్పించుకున్నారు.కాగా ఈ సారి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపు నుంచి అధ్యక్ష అభ్యర్థిగా మహిళ నిలబడతారని వాదన మాత్రం బలంగా వినిపిస్తున్నాయి అయితే ఈ రేసులో మిచెల్ ఒబామా ఉన్నారా లేదా కమలా హరిస్ ఉన్నారా అనేది తేలాల్సి ఉంది
.






