జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుధీర్ ఒకరు.కమెడియన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగారు.
అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ వెండితెరపై కూడా సుదీర్ సందడి చేశారు.అయితే సుధీర్ కు విపరీతమైన క్రేజ్ ఉండడంతో ఏకంగా ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
సుడిగాలి సుదీర్ ఇది వరకే సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ వంటి సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాలో పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం వాంటెడ్ పండుగాడ్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా తీవ్ర నిరాశపరిచింది.ఇకపోతే గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా సుధీర్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ కేటాయించిన చిత్రం అని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం నిర్మాతలు 2.5కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సినిమా చేశారని సమాచారం. అయితే సుధీర్ కెరియర్ లో నటించిన సినిమాలలో ఈ సినిమా కోసం హైయెస్ట్ బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది.
అదేవిధంగా ఈ సినిమాలో సుధీర్ నటించినందుకు గాను భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.ఈ ఒక్క సినిమా కోసం ఈయన 40 నుంచి 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.జబర్దస్త్ కార్యక్రమంలో ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు 1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకొనే సుడిగాలి సుదీర్ గాలోడు సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నారు.ఇక గత కొద్దిరోజులుగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి సుధీర్ తాజాగా రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







