స్నేహితుడి మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌

పవన్‌ కళ్యాణ్‌ గత ఏడాదిలో వకీల్‌ సాబ్‌తో కలిపి మొత్తం నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు.

అందులో వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.

ఇక క్రిష్‌ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో పవన్‌ పాల్గొంటున్నాడు.

ఈ సమయంలోనే ఆయన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కూడా ఒప్పుకున్నాడు.ఆ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించబోతుంది.

మూడు సినిమాలు కాకుండా పవన్‌ తనకు మిత్రుడు మరియు ఆప్తుడు అయిన రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు.ఆ సినిమా కు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరిగింది.

Advertisement

కాని కొన్ని వారాలుగా ఈ కాంబో మూవీ క్యాన్సిల్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వకీల్‌ సాబ్‌ తర్వాత మలయాళం మూవీ రీమేక్‌ ఇంకా హరి హర వీరమల్లు సినిమా రాబోతుంది.

ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ మరియు సురేందర్‌ రెడ్డిల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా ను వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.

ఈ సినిమా క్యాన్సిల్‌ అయ్యిందని వస్తున్న వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేశారు.దర్శకుడు సురేందర్‌ రెడ్డి సన్నిహితుల వద్ద ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

అయితే అఖిల్‌ తో మూవీ తర్వాత ఆ సినిమా ఉంటుందని తెలుస్తోంది.పెద్ద మొత్తంలో ఈ సినిమా కు బడ్జెట్‌ ను కేటాయించబోతున్నట్లుగా రామ్‌ తాళ్లూరి సన్నిహితులు అంటున్నారు.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?

ఇప్పటికే ప్రకటించిన అన్ని సినిమాలను పవన్‌ పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.రాజకీయాలు చేస్తూనే మరో వైపు సినిమాలను కూడా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు