ఆ విషయంలో పవన్ కళ్యాణ్, కూతురు ఆద్య సేమ్ టు సేమ్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )గురించి మనందరికీ తెలిసిందే.

మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయం దగ్గర పడడంతో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు.

ఈసారి ఎలక్షన్స్ లో పిఠాపురం ( Pithapuram )నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.దాంతో పవన్ కళ్యాణ్ క్షణం కూడా తీరిక లేకుండా హడావిడిగా గడిపేస్తున్నాడు.

ఇకపోతే ఇటీవల హరిహర వీరమల్లు టీజర్( Harihara Veeramallu Teaser ) తో అదరగొట్టిన పవన్ వింటేజ్ లుక్ లో వావ్ అనిపించాడు.

ఫ్యాన్స్ మురిసిపోయేలా రికార్డులు కొల్ల గొట్టాడు.ఇదిలా ఉంటే నెట్టింట పవన్, ఆయన కూతురు ఆద్యకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.ఆ ఫోటోస్ ని కంపేర్ చేస్తున్న అభిమానులు ఖుషి అవుతున్నారు.

Advertisement

ఇకపోతే అసలు విషయంలోకి వెళితే పవన్ కళ్యాణ్ పాల్గొన్న పవన్ కళ్యాణ్ ని యాంకర్ మీకు నచ్చిన పాట ఏంటి అని అడగగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అమితాబ్ బచ్చన్ సాంగ్ ఏ తే ఏ మౌసం అంటూ పాట పాడి మరీ వినిపించారు.ఇక ఆద్య( Adhya ) తొలిసారి ఆడియన్స్ కు అఫిషియల్ గా కనిపించిన షోలో కూడా తన ఫేవరెట్ సాంగ్ అంటూ ఇదే పాట పాడటం విశేషం.

దీంతో ఆ జీన్స్, బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతుంది చెప్పండి.ఇద్దరి ఇష్టాయిష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి.ఆ విషయంలో మాత్రం ఇద్దరు సేమ్ టు సేమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఆద్య ఆ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇకపోతే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, భగవదియుడు భగత్ సింగ్, లాంటి సినిమాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు