పరిటాల కుటుంబం ప్రభ మసకబారుతుందా

పరిటాల రవి ఈ పేరు ఒకప్పుడు ఒక ప్రభంజనం ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తారు ఆన్అ విమర్శలు ఉన్న కూడా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసిన పరిటాల కుటుంబం ఒకప్పుడు రాయలసీమలో రాజకీయంగా నిర్ణయాత్మకమైన స్థానంలో ఉండేది .

పరిటాల రవి మరియు ఆయన అనుచర వర్గం కనుసనల్లోనే రాయలసీమ రాజకీయాలు నడిచే స్థాయిలో ఆయన తన ప్రభావం చూపించారు .

ఒకానొక టైమ్ లో తన నిర్ణయాలతో రాష్ట్రస్థాయిలో కూడా ప్రభావం చూపించే విధంగా ఆయన హవా నడిచింది ఆయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల సునీత గారు ఆ స్థాయిలో రాష్ట్రంపై తన ప్రభావం చూపించలేకపోయినా నియోజకవర్గం వరకు పరిటాల కుటుంబ ప్రభావం నిలబెట్టగలిగారు.పరిటాల రవి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల శ్రీరామ్ మొదట్లో కొంత ప్యాక్షన్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా కనిపించినప్పటికీ తరువాత పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారు.

అయితే తండ్రి స్థాయిలో క్రియాశీలక రాజకీయాలు చేయడంలోనూ, అనుచర వర్గాన్ని నిలబెట్టుకోవడంలోనూ కొంత వెనకబాటుకు గురైనట్టుగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తెలియజేస్తున్నాయి వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన వైజాగ్ సమ్మిట్ లో ప్రభుత్వ చూపించిన లెక్కలపై .

పరిటాల శ్రీరామ్ విమర్శలు చేశారు ఒక స్థాయిలో జగన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా ఆయన చేశారు దీనిపై గుంటూరుకు చెందిన హరికృష్ణ అనే అభిమాని శ్రీ రామ్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు శ్రీరామ్ ని విమర్శిస్తూ రకరకాల పోస్టులు పెట్టారు.అయితే గుంటూర్ లో కుర్చీ శ్రీ రామ్ ని విమర్శించడం కాదని దమ్ముంటే అనంతపురం రావలంటూ కొంత మంతి నెటిజనులు ఆయనను సవాలు చేశారు .

Advertisement

ఆ సవాలుని స్వీకరించిన ఆ కుర్రాడు అనంతపురం క్లాక్ టవర్ మరియు అనంతపురం టిడిపి ఆఫీసులకి ప్రత్యక్షంగా వచ్చి ఆ వీడియోలను కూడా మీడియాలో రిలీజ్ చేశాడు.తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించిన శ్రీరామ్ ఈ వ్యవహారానికి దూరంగా ఉండి ఉండవచ్చు అయితే పరిటాల రవికి ఉన్న భారీ అనుచర వర్గం కూడా కనీసం స్పందించిన పాపాన పోలేదు.విషయం చిన్నది అయినా ఈ ఉదంతాన్ని గమనించినప్పుడు అనుచర వర్గంలో శ్రీరామ్ తన ఉనికిని కోల్పోతున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయి .

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు