ప్రస్తుతం పాన్ కార్డు మనందరి జీవితంలో అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారిపోయింది.బ్యాంక్ ఖాతా తెరవడం, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వరకూ పాన్ కార్డు తప్పనిసరి.
ఇలా ప్రతి ఆర్థిక కార్యకలాపాల్లో పాన్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది కాబట్టి దానిని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఒకవేళ పాన్ కార్డు కనిపించకుండ పోయినా ఆందోళన పడాల్సిన పని లేదు.
ఎందుకంటే మీరు మళ్లీ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.దీన్నే డూప్లికేట్ పాన్ కార్డుగా పిలుస్తారు.ఈ డూప్లికేట్ పాన్ కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేయొచ్చు.అలాగే, ఈ-పాన్ కార్డును ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అదెలాగో తెలుసుకుంటే.
మొదటగా ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
తరువాత డౌన్‌లోడ్ ఈ-పాన్ కార్డ్అనే లింక్ పై క్లిక్ చేయాలి.ఇప్పుడు మీ పాన్ నంబర్, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి.
ఆపై మీ డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలి.మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీకి రిక్వెస్ట్ పెట్టాలి.
ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయ్యాక పేమెంట్ చేయాల్సి ఉంటుంది.ఇప్పుడు మీరు పేమెంట్అ నే ఆప్షన్ పై క్లిక్ చేసి రూ.8.26 చెల్లించాలి.పేటీఎమ్, యుపీఐ, క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ఇలా రకరకాల చెల్లింపు పద్ధతుల్లో పేమెంట్ చేయొచ్చు.ఇది పూర్తయిన తర్వాత ఈ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-పాన్ కార్డు ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో ఉంటుంది.ఇది ఓపెన్ చేయాలంటే పాస్ వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఆ పాస్ వర్డ్ మీ పుట్టిన తేదీ అని గుర్తు పెట్టుకోవాలి.మీ పాన్ కార్డును ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో పోగొట్టుకున్నట్లయితే.వెంటనే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.అలాగే మీ పాన్ కార్డుతో ఏదైనా లావాదేవీ జరిగిందా? అనే విషయాన్ని ఫారం 26ఎఎస్ ద్వారా తెలుసుకోవాలి.