పాక్ నటుడి నోట భారత మాట.. దీపక్ పెర్వానీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు..

పాకిస్థానీ నటుడు,( Pakistan Actor ) ఫ్యాషన్ డిజైనర్ అయిన దీపక్ పెర్వానీ( Deepak Perwani ) చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

పాక్‌ కంటే ఇండియా( India ) అన్ని విధాలుగా మెరుగ్గా ఉందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం దుమారం రేపుతోంది.

ఫ్యాషన్ రైటర్ ఆమ్నా హైదర్ సమ్‌థింగ్ హాట్ షోలో( Something Hot Show ) పెర్వానీ మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ఉన్న తేడాలను ఎత్తి చూపారు.ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, స్వేచ్ఛ, ప్రజల సంతోషం వంటి అంశాలలో ఇండియా చాలా ముందుందని కొండ బద్దలు కొట్టేశారు.

"ఇండియన్స్ చాలా సంతోషంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు.వాళ్లు నవ్వుతూ, జీవితాన్ని నచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు.

అక్కడ మహిళలు రోడ్లపై స్వేచ్ఛగా నడుస్తున్నారు, సైకిళ్లు, బైకులు నడుపుతున్నారు.రిక్షా, క్యాబ్ డ్రైవర్లు కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ తీసుకుంటున్నారు" అని పెర్వానీ అన్నారు.

Advertisement
Pakistani Designer Deepak Perwani Gets Slammed For Praising India Details, Deepa

అంతేకాదు, భారతీయ నగరాల్లో రోడ్లు నడవడానికి అనువుగా ఉన్నాయని, పాక్‌లో( Pakistan ) మాత్రం ఆ పరిస్థితి లేదని చురకలంటించారు.కరాచీలో పేవ్‌మెంట్లు లేకపోవడంతో ప్రజలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.

Pakistani Designer Deepak Perwani Gets Slammed For Praising India Details, Deepa

"ఇండియన్ సిటీల్లో( Indian Cities ) ఒక ప్రత్యేకమైన శక్తి, ఉత్సాహం కనిపిస్తున్నాయి.అక్కడ రోడ్లకు ఇరువైపులా నడవడానికి వీలుగా ఫుట్‌పాత్‌లు ఉన్నాయి.కానీ మా దేశంలో కేవలం కాంక్రీట్ రోడ్లు మాత్రమే కనిపిస్తాయి" అని పెర్వానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Pakistani Designer Deepak Perwani Gets Slammed For Praising India Details, Deepa

దీపక్ పెర్వానీ చేసిన ఈ వ్యాఖ్యలు దాయాది దేశంలో తీవ్ర దుమారం రేపాయి.కొందరు ఆయనను దేశద్రోహి అని విమర్శిస్తుంటే, మరికొందరు ఈ నటుడు నిజమే మాట్లాడాడు కదా అంటూ సమర్థిస్తున్నారు.ఓ యూట్యూబ్ యూజర్ "అతనికి ఇండియా అంత నచ్చితే అక్కడికి వెళ్లిపోవచ్చు కదా, ఇక్కడ విమర్శలు చేయడం ఎందుకు?" అని ప్రశ్నించారు.మరొకరు "పాక్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశం.

మనం వాస్తవాన్ని అంగీకరించి, అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి, కానీ అబద్ధపు భ్రమల్లో ఉండకూడదు" అని అన్నారు.పెర్వానీ వ్యాఖ్యలు చర్చకు దారితీసినా పాక్‌లో అభివృద్ధి అవసరం గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి11, మంగళవారం 2025
విజయ్ దేవరకొండ చేస్తున్న రౌడీ జనార్ధన్ పరిస్థితి ఏంటి..?

ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు