9 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మంత్రి ఇండియాలో పర్యటన..!!

పాకిస్తాన్ ఇండియా దేశాల మధ్య శత్రుత్వం ఎప్పటినుంచో ఉందన్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో గొడవ ప్రపంచ స్థాయిలో నడుస్తూనే ఉంది.

దీంతో 2014 నుంచి ఇరుదేశాల మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.అప్పటిదాకా ఇరుదేశాల నాయకులు ఒకరి దేశంలో మరొకరు పర్యటించే వాళ్ళు.

కానీ 2014 నుండి ఏ ఒక్కరు కూడా మరొకరి దేశంలో పర్యటించలేదు.ఇటువంటి పరిస్థితులలో తాజాగా 9 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మంత్రి( Pakistan Minister ) ఇండియాలో పర్యటించడానికి రెడీ అయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే మే 4,5 తారీకులలో గోవాలో జరగనున్న షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్( Shangai Corporation Organization ) సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిల్ వాల్ భుట్టో ( Bilawal Bhutto Zardari ) పర్యటించబోతున్నారు.

Advertisement

ఈ విషయాని విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ముంతాజ్ జ‌హ‌రాహ్ బ‌లోచ్ తెలిపారు. తాము ఆ మీటింగ్‌కు హాజ‌రుకావ‌డం ఎస్సీవో ప‌ట్ల పాక్ క‌ట్టుబ‌డి ఉంద‌న్న సంకేతాన్ని ఇస్తుంద‌ని స్పష్టత చేశారు.పాక్ త‌మ విదేశాంగ విధానంలో ఎస్సీవో మీటింగ్ ప్రాధాన‌త్య ఇస్తుంద‌ని పేర్కొన్నారు.2014 తర్వాత తొలిసారి పాకిస్తాన్ మంత్రి ఇండియాకి రావడం ఇదే.

భారత కేంద్రమంత్రి ఎస్.జయశంకర్ ఆహ్వానం మేరకు భుట్టో ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు.2014లో చివ‌రి సారి న‌వాజ్ ష‌రీఫ్ ఇండియాకు వ‌చ్చారు.ఆ త‌ర్వాత పాక్ మంత్రులెవ్వ‌రూ ఇండియాను విజిట్ చేయ‌లేదు.

ఇప్పుడు మ‌ళ్లీ భుట్టో ఇండియాలో అడుగుపెట్ట‌నున్నారు.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు