ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అందరిని గజగజలాడిస్తున్న విషయం విదితమే.ప్రపంచ దేశాలు అన్ని కూడా ఈ మహమ్మారి పై పోరాటానికి సిద్దమైపోతున్నాయి.
ఈ మహమ్మారి వైరస్ కు రాజు,పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధితులుగా మారిపోతున్నారు.ఈ క్రమంలో దేశ రాణులు,ప్రధానులు,మంత్రులకు సైతం ఈ కరోనా సోకి ఆసుపత్రి పాలు అవుతున్నారు.
మరికొందరు కరోనా భయం తో క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సి పడుతుంది.అయితే తాజాగా పొరుగుదేశం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కూడా కరోనా టెన్షన్ పట్టుకుంది.
ఇటీవల ఆయన ఒక కరోనా పేషేంట్ ను కలవడం తో ఆయన్ని ఐసోలేషన్ లో ఉండాలంటూ వైద్యులు సూచించారట.
ఒకపక్క ఆర్ధిక కష్ఠాలలో ఉన్న పాకిస్థాన్ లో కూడా కరోనా కేసులు పెరుగిపోతుండడం తో ప్రపంచ దేశాలను పాక్ సాయం కూడా కోరింది.
అయితే ఇప్పుడు దేశ ప్రధానికే కరోనా టెన్షన్ పట్టుకోవడం తో అక్కడి ప్రజలు అయోమయం లో పడ్డారు.వివరాల్లోకి వెళ్తే.ప్రముఖ స్వచ్ఛందసేవా సంస్థ ‘ఈదీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు ఫైసల్ ఈదీ ఇటీవల ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిసి కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌కు పది మిలియన్ల చెక్‌ను అందజేశారు.ఆ సమయంలో చేతులు కలిపి మరి చెక్ అందుకున్న తరువాత ఫండ్ ఇచ్చిన ఈదీకి కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది.
అంతేకాక ఆయన కుటుంబసభ్యులు, ఫౌండేషన్‌లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్లు తేలడం తో ప్రధాని గారికి కరోనా టెన్షన్ మొదలైంది.ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా ఆయనను ఐసోలేషన్ ఉండాలని సూచించి,పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.

ఒకవేళ ఏదైనా కరోనా లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే క్వారంటైన్ కు పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.అయితే ఒకవేళ ఇమ్రాన్ క్వారంటైన్‌కు వెళ్తే.అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా లక్షణాలు సోకడం తో స్వీయ క్వారంటైన్ కి వెళ్లారు.
అయితే అప్పటికి కూడా కోలుకోకపోవడం తో చివరికి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం తో ఆయన పూర్తిగా కోలుకుని ఇటీవలే ఇంటికి కూడా తిరిగివెళ్ళిపోయిన విషయం తెలిసిందే.