భారతీయ అమెరికన్ కి అరుదైన గౌరవం..ఐరాస అంబాసిడర్ గా  

Padma Lakshmi Appointed Undp\'s Goodwill Ambassador-indian-american Tv Personality,padma Lakshmi,undp

  • భారత సంతతికి చెందిన ఎంతో మంది విదేశాలలో స్థిరపడ్డారు. తమ ప్రతిభతో ఆయా దేశాలలో ఉన్నతమైన స్థానాలలో ఎంతో మంది కొలువు దీరిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మందికి ప్రపంచ దేశాలలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరెంతో మందికి స్పూర్తి దాయకం అయ్యారు.

  • ఈ కోవలోనే భారతీయ అమెరికన్, టీవీ దిగ్గజం, ఆహారా నిపుణురాలు అయిన పద్మాలక్ష్మికి అరుదైన గుర్తింపు లభించింది. పద్మా లక్ష్మి “యూఎన్‌డీపీ” గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసమానతలు ,భేదభావాలకు వ్యతిరేకంగా సాధికారత కోసం పోరు చేసిన ఆమె మరింత సహకారమిస్తారని యూఎన్‌డీపీ చెప్పింది.

  • Padma Lakshmi Appointed UNDP's Goodwill Ambassador-Indian-american Tv Personality Padma Undp

    Padma Lakshmi Appointed UNDP's Goodwill Ambassador

  • ప్రపంచ మహిళా దినోత్సవం లో యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్‌ అచిం స్టెయినర్‌ ఈ విషయం ప్రకటించారు. అనేక దేశాలు పేదరికాన్ని చాలా వరకు తగ్గించినప్పటికీ, లింగ ,వయో ,జాతి విషయాలలో మాత్రం అసమానతలని తగ్గించలేక పోతున్నామని ఆమె అన్నారు.