ఏపీ రాజకీయాలలో ప్రజల మధ్య, నాయకుల మధ్య రాజకీయ వేడి ఎలా ఉంటుందో తమిళనాడు రాజకీయాలలో కూడా అదే స్థాయిలో వుంటుంది.తమిళనాడు రాజకీయాలని ఇంత కాలం శాసిస్తూ వచ్చిన జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఆ రాష్ట్రంలో తెలియని నిర్లిప్తత ఆవహించింది.
ఇంతకాలం తమిళనాడు రాజకీయాలని సాశించిన అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత కుములటలు వున్నాయి.అలాగే డీఎంకే పార్టీలో కూడా కుటుంబ కలహాలతో ఆధిపత్య పోరు కనిపిస్తుంది.
ఈ నేపధ్యంలో మరో సారి తమిళ రాజకీయ ముఖచిత్రంపైకి సినిమా స్టార్స్ వచ్చారు.
అది కూడా తమిళ రాజకీయాలలో ఎమ్జీఆర్, కరుణానిధి ఎలా అయితే మిత్రులుగా వుండి తరువాత రాజకీయ శత్రువులుగా మారారో ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన రజినీకాంత్, కమల్ హసన్ మిత్రుత్వం నుంచి రాజకీయ శత్రువులుగా మారిపోయారు.
ఇప్పటికే కమల్ హసన్ పార్టీ పెట్టి రాజకీయంగా దూసుకుపోతున్నారు.మరో వైపు రజినీకాంత్ కూడా పార్టీ పెట్టిన ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకి దూరంగా వుంటూ సార్వత్రిక ఎన్నికలపై ద్రుష్టి పెట్టారు.
ఇదిలా వుంటే తాజాగా కమల్ హసన్ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ కేటాయించింది.దీనిపై సంతోషం వ్యక్తం చేసిన కమల్ రానున్న ఎన్నికలలో తాను టార్చ్ బేరర్ గా మారుతాను అని చెప్పడానికి సంకేతంగా ఈ గుర్తు వచ్చింది అని చెప్పుకొచ్చారు.







