ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం...!

నల్లగొండ జిల్లా: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెగా టెక్స్ టైల్స్ పార్కు మంజూరు చేసిన సందర్భంగా బీజేపీ చేనేత శాఖా ఆధ్వర్యంలో ఆదివారం చర్లపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభవృద్ధికి కట్టుబడి ఉందని దీనితో రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది అన్నారు.

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఈ టెక్స్ టైల్ పార్క్ వల్ల ఎంతో మేలు చేకూరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ చేనేత రాష్ట్ర కోఆర్డినేట్ మెంబర్ మిరియాల వెంకటేశ్వర్లు,జిల్లా చేనేత నాయకుడు తిరందాసు కనకయ్య,నలగొండ మండల ఇన్చార్జి రాపోల్ విద్యాసాగర్,బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు బద్దం నాగేష్,చేనేత నల్గొండ పట్టణ శాఖ కన్వీనర్ కటకం శ్రీధర్,బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు సైదులు గౌడ్,శ్రీనివాస్ యాదవ్, రాపోలు భాస్కర్, జి.నాగేష్,మహేష్, నాగరాజ్,రాపోల్ సాగర్, గంజి వెంకట్,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

Latest Nalgonda News