కూరగాయల సాగులో పాటించాల్సిన నారుమడుల యాజమాన్య పద్ధతులు..!

కూరగాయల సాగు( Vegetable Cultivation )ను విత్తన పరిమాణం బట్టి నేరుగా లేదంటే నారుమడులలో పెంచిన నారును పొలంలో విత్తుకుంటారు.

ఉదాహరణకు చిక్కుడు, బెండ, గోరుచిక్కుడు, మునగ విత్తనాలను నేరుగా పొలంలో నాటుకుంటారు.

టమాటా, వంగ, మిరప, ఉల్లి విత్తనాల పరిమాణం చిన్నగా ఉండటంవల్ల ముందుగా నారుమడులలో నారు పెంచి ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకుంటారు.అయితే నారు మడులలో ఆరోగ్యవంతమైన నారును పెంచడంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.

Ownership Methods Of Rubber Plants To Be Followed In Vegetable Cultivation , Ve

నారు మడులు పెంచే ప్రదేశం సూర్యరశ్మి, గాలి బాగా తగిలే విధంగా ఉండాలి.నీటి వసతి నారు మడికి దగ్గరగా ఉండాలి.నేలను రెండు లేదా మూడుసార్లు లోతు దుక్కులు దున్నుకోవాలి.

ఆ తరువాత నేలను చదును చేసి, ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తీసేయాలి.నారు మడి నాలుగు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు, 15 సెంటీమీటర్లు ఎత్తు ఉండేటట్లు తయారు చేసుకోవాలి.

Advertisement
Ownership Methods Of Rubber Plants To Be Followed In Vegetable Cultivation , Ve

ఒక ఎకరం పొలానికి అవసరమయ్యే నారును 40 చదరపు మీటర్ల స్థలంలో పెంచాలి.

Ownership Methods Of Rubber Plants To Be Followed In Vegetable Cultivation , Ve

నారుమడులు ఎత్తుగా ఉంటే నీరు నిల్వ ఉండకుండా కిందకు జారిపోతుంది.దీంతో కుళ్ళు తెగుళ్లు నివారించబడుతుంది.ఈ నారుమళ్ళను తెల్లటి పాలిథిన్ కాగితంతో( Polythene paper ) మే నెలలో రెండు వారాలు కప్పి సూర్యరశ్మి ద్వారా అధిక ఎండ వేడికి గురి చేయడం వలన నేలలో ఉండే శిలీంద్రాలు, ఫంగస్( Fungus ), వైరస్ లాంటివి చనిపోతాయి.40 చదరపు సెంటీమీటర్ల నారుమడికి 40 కిలోల మాగిన పశువుల ఎరువు, రెండు కిలోల అజోస్పైరిల్లం అందించాలి.విత్తన శుద్ధి చేసిన విత్తనాలను నారుమడులలో పలుచగా విత్తుకోవడం వల్ల మొలకలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలి నారు ఆరోగ్యకరంగా పెరుగుతుంది.

నారుమళ్ళను ఎప్పుడు శుభ్రమైన ఎండు గడ్డితో కప్పాలి.గడ్డి కప్పడం వల్ల అధిక వర్షాలు లేదా నీరు పెట్టినప్పుడు విత్తనాల స్థాన చలనం అవ్వకుండా ఉండడమే గాక చలికాలంలో అయితే అధిక చలి నుండి వేసవికాలంలో అయితే అధిక వేడి నుండి రక్షింపబడి విత్తనాలు మొలకెత్తుతాయి.

విత్తనం మొలకెత్తిన తర్వాత గడ్డిని తీసేయాలి.నారుమళ్ళలో ఎప్పటికప్పుడు కలుపు ను తీసేయాలి.నారు పీకడానికి వారం రోజుల ముందు నీరు ఇవ్వడం తగ్గించి నారు మొక్కలు గట్టి పడేలా చేయాలి.8 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన నారు పంట పొలంలో నాటుకోవచ్చు.

డ్రాగన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా.. ఆ తేదీ నుంచి ఓటీటీ ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు