అక్కడ ఒక్క డాలర్ కే ఇల్లు సొంతం... కాకపోతే...?

మనిషికి గాలి, నీరు, తిండి, గుడ్డ తోపాటు ఉండడానికి ఇల్లు కూడా అంతే అవసరం.

ప్రతి ఒక్క మనిషికి జీవితంలో తాను ఒక ఇంటికి యజమాని అవ్వాలని కోరిక ఉంటుంది.

ప్రస్తుత రోజుల్లో నగరాల్లో ఇల్లు కొనాలంటే ఆషామాషీ సంగతి కాదు.అలాగని పల్లెటూర్లో కూడా కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

భారీగా ధరలు పెరిగిపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది.అయితే కేవలం ఒకే ఒక్క డాలర్ కు ఇల్లు వస్తుందంటే మీరు నమ్ముతారా.? ఉరుకొండి జోకులు వేస్తున్నారు అని కొట్టి పారేస్తారు.! కాకపోతే ఇది నిజమేనండి.

కేవలం ఒక్క డాలర్ చెల్లిస్తే ఆ గ్రామంలో మీకు ఇల్లు సొంతమవుతుంది.అయితే కొన్ని కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి అండోయ్.

Advertisement

ఇది ఇటలీ దేశంలోని చిక్వఫౌండ్రీ అనే గ్రామంలో ఉన్న వారంతా పట్టణాలకు వలస వెళ్ళిపోయారు.దీంతో ఆ గ్రామం పూర్తిగా ఖాళీ అయిపోయింది.

అక్కడ మనుషులు లేకుండా కేవలం ఇల్లు మాత్రమే మిగిలిపోయాయి.దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ ఊరిలో ఉన్న భవనాలు వృధా కాకుండా ఉండటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగానే ఒక్క రూపాయి చెల్లించిన వారికి ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది.అయితే, ఇల్లు కొన్న వారు మాత్రం అక్కడే స్థిరనివాసం ఉండాలి.

అక్కడ చేరిన తరువాత ఆ ఇంటిని బాగు చేసుకోవాలి లేదంటే పూర్తిగా పున నిర్మించుకోవాలి.లేకపోతే ఇందులో నిర్మించుకునే వరకు రూ.21 వేలు బీమా చెల్లించాల్సి ఉంటుంది.అంతేకాదు మూడేళ్ల లోపు ఇంటిని బాగు చేసుకోకపోతే ఏకంగా 17 లక్షల జరిమానా విధిస్తారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఈ పక్రియ కు ఆపరేషన్ బ్యూటీ అని నామకరణం చేశారు అధికారులు.దీని ఉద్దేశం గ్రామాలన్నీ మళ్లీ ప్రజలతో కళకళలాడాలన్నది ఆ ప్రభుత్వ లక్ష్యం..

Advertisement

తాజా వార్తలు