బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నాయి.

ఎన్నికలకు దాదాపు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో అటు కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలూ బీజేపీని ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా శివసేన పార్టీ నేతలు కూడా ఆ దిశగా పావులు కదుపుతున్నారు.అయితే దేశంలో బీజేపీ ప్రత్యక్షంగా, కూటములతో కలిపి దాదాపు18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించడం ప్రతిపక్షాలకు అంత సులువైన పని కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.2014లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి 9 రాష్ట్రాలలో కాషాయ జెండా రెపరెపలాడింది.ఈశాన్య రాష్ట్రాలలో సైతం పార్టీ అధికారంలోకి వచ్చింది.మొన్న జరిగిన ఐదు రాష్టాల ఎన్నికల్లో తిరిగి నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించి సత్తా చాటింది బీజేపీ.2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి పోటీగా ఎవరు నిలుస్తారు అనేదాని కంటే, అసలు బీజేపీని ఎవరు ఓడించగలరు? అని ప్రశ్నించుకుంటే.ఆ పని సెకండ్ ఫ్రంట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పీకే గతంలో కామెంట్ చేశారు.

దేశంలో థర్డ్ ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు.బీజేపీని తొలి ఫ్రంట్ అనుకుంటే.దానిని ఓడించేందుకు రెండో ఫ్రంట్ మాత్రమే ఉండాలని థర్డ్ ఫ్రంట్ కు ఆస్కారమే లేదని పీకే పేర్కొన్నారు.

అలాంటప్పుడు మరి కాంగ్రెస్‌ను రెండో ఫ్రంట్‌గా భావిస్తారా? అన్న ప్రశ్నకు కాంగ్రెస్ దేశంలో రెండో అతిపెద్ద పార్టీ మాత్రమేనని ఆయన బదులిచ్చారు.

Advertisement

మరి ఆ సెకండ్ ఫ్రంట్ లో తృణమూల్, శివసేన, డీఎంకేలు కలుస్తాయా అనేది ప్రశ్నార్థకం.అసలు కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీని ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి.అటు జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేస్తానని శపథాలు చేసిన కేసీఆర్ సడన్ గా సైలెంట్ అయ్యారు.

ఫ్రంట్లు, టెంట్లు ఉండబోవని, పార్టీల ప్రస్తావన లేని జాతీయ ప్రత్యామ్నాయ అజెండా రూపకల్పనే తమ ధ్యేయమని సరిపెట్టారు.ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి.

నిజానికి మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ పాలనపైనే కాకుండా ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో తిరిగి పార్టీ గెలుపుపై విశ్లేషకులు కొన్ని అనుమానాలను వెలిబుచ్చారు.ముఖ్యంగా రైతు చట్టాలపై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం, ఉన్నావ్, హత్రాస్ ఘటన ఇలా ఎన్నో కారణాలు చూపుతూ.బీజేపీ ఓటమి తథ్యమని అంతా భావించారు.

కానీ విశ్లేషకులు, ప్రతిపక్షాల అంచనాలు తలకిందులయ్యాయి.నాలుగు రాష్టాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

యూపీలో ఈ స్థాయిలో గెలుపు ఎవరూ ఊహించ లేదు.ఇక స్థానిక పరిస్థితులు ఎట్లా ఉన్నా, దేశ ప్రజలు కేంద్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

Advertisement

దానికి మోదీ మానియా, సుస్థిర పాలన, లాంటి కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు.

తాజా వార్తలు