కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ పూర్తి పరామర్శించిన సీఎం కేసీఆర్..!!

బీఆర్ఎస్ నేత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై ( MP Prabhakar Reddy )ఉదయం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.

సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు.

కత్తితో దాడి చేసిన నిందితుడ్నీ బీఆర్ఎస్ కార్యకర్తలు ( BRS workers )చితకబాది పోలీసులకు అప్పగించారు.ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డినీ హుటా హుటినా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించటం జరిగింది.

ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ చేయడం జరిగింది.ఆపరేషన్ లో చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు.15 సెంటీమీటర్ల పై కడుపును కట్ చేసి పది సెంటీమీటర్ల చిన్న ప్రేగును తొలగించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.రక్తమంతా కూడా కడుపులో పేరుకుపోవడంతో 15 సెంటీమీటర్లు కట్ చేసి మొత్తం క్లీన్ చేసినట్లు వైద్యులు తెలియజేశారు.

చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయం కావడంతో సర్జరీ ఇంత ఆలస్యమైందని పేర్కొన్నారు.గ్రీన్ ఛానల్ తో హైదరాబాద్ కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేది అని స్పష్టం చేశారు.

Advertisement

మరొక పక్క హత్యాయత్నం చేసిన నిందితుడు సైతం తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలిస్తున్నారు.ఎంపీపై హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు స్వగ్రామం మిరుదొడ్డి మండలం చెప్యాలగా పోలీసులు గుర్తించడం జరిగింది.

ఈ క్రమంలో పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు.సమాచారం.

దీంతో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు.ఇదిలా ఉంటే ఆపరేషన్ పూర్తి కావడంతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ధైర్యం తెలియజేశారు.

జనసేన లోకి వారంతా క్యూ ... టీడీపీ నేతల్లో ఆగ్రహం ? 
Advertisement

తాజా వార్తలు