"ఆపరేషన్ అజయ్" ఇజ్రాయెల్ నుంచి భారత్ కి బయలుదేరిన రెండో విమానం..!!

ఇజ్రాయెల్( Israel ).హమాస్ ల మధ్య గొడవ ప్రపంచ దేశాలను కంటి మీద కునుక్కు లేకుండా చేస్తుంది.

ఈ యుద్ధం ఉదృతంగా మారితే మూడో ప్రపంచ యుద్ధం దాపురించే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.అక్టోబర్ 7వ తారీకు నుండి ఇజ్రాయెల్.

హమాస్ ఉగ్రవాదుల( Hamas terrorists ) మధ్య జరుగుతున్న పోరులో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులను చాలా ఘోరంగా దారుణంగా చంపుతున్నారు.

పిల్లలను సైతం వదలకుండా పీకలు కోసేస్తున్నారు.ప్రస్తుతం ఇజ్రాయెల్ లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి.

Advertisement

ఈ క్రమంలో ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులను సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం "ఆపరేషన్ అజయ్"( Operation Ajay ) ను చేపట్టిన సంగతి తెలిసిందే.ఆల్రెడీ శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ నుంచి మొదటి విమానంలో 212 మంది చేరుకున్నారు.

కాగా తాజాగా మరికొంతమంది రెండో విమానంలో ఇజ్రాయెల్ లో టెల్ ఆవివ్ నుంచి భారత్ కు బయలుదేరడం జరిగింది.ఇజ్రాయెల్ లో ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే మరికొన్ని నెలలు పాటు ఈ యుద్ధం సాగే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయ్యి భారత పౌరులను సురక్షితంగా తీసుకోస్తోంది.అంతేకాదు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కి మద్దతు తెలపడం జరిగింది.

ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది.

అదిగో అన్నారు ఇదిగో అన్నారు... వాయిదా వేశారంటయ్యా ? 
Advertisement

తాజా వార్తలు