నదిలో లక్ష లింగాల.. నిజమెంత?

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు కొదవ లేదు.రోజుకో ఫేక్ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంటుంది.

ఇంకా వాట్సాప్ లో అయితే అసలు బ్రేక్ లేదు.వార్త బాగుండి.

కాస్త దైవంకు సంబంధించినది అయితే షేర్లపైనా షేర్లు చేస్తుంటారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ గాలి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది ఏంటంటే? దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ల‌క్ష లింగాల పుణ్య‌క్షేత్రం బ‌య‌ట‌ప‌డింది.క‌ర్ణాట‌క‌లోని శివ‌కాశీ న‌దిలో నీటి ప్ర‌వాహం త‌గ్గ‌డంతో ఈ లింగాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

Advertisement

మ‌న స‌నాత‌న సంస్కృతికి ఇవే రుజువు.హిందువులారా మేల్కొనండి, హిందువుల‌మ‌ని గ‌ర్వించ‌డి అంటూ ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కానీ నిజానికి క‌ర్ణాట‌క‌లోని సిర్సి తాలూకాలో ద‌ట్ట‌మైన అడ‌విలో ఉండే ఈ నదిని 2011లోనే ప‌ర్యావ‌ర‌ణ శాస్త్రవేత్త‌లు కనుగొన్నారు.ఈ ప్రాంతం గురించి అప్పుడే ప్ర‌పంచానికి తెలియజేశారు.

ఇంకా అందులో ప‌దులు, వంద‌లు కాకుండా వేల సంఖ్య‌లో శివ లింగాలు చెక్కి ఉన్నాయి.ఆ శివలింగాలను క్రీ.శ‌.1678-1718 కాలంలో సిర్సి రాజు అర‌స‌ప్ప నాయ‌క్ ఈ లింగాల‌ను చెక్కించిన‌ట్లు ఉత్త‌ర క‌న్న‌డ‌ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమో ఏకంగా లక్ష లింగాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

క‌ర్ణాట‌క‌లోని షాల్మ‌లా న‌దీ ప్రాంతంలో ఉన్న ఈ శివ‌లింగాలు ప‌ర్యాట‌కానికి కూడా ప్ర‌సిద్ధి చెందింది.తొమ్మిదేళ్ల క్రితమే ఫేమస్ అయినా ప్రాంతం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు రాసి వైరల్ చేస్తున్నారు.

వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?
Advertisement

తాజా వార్తలు