ఒమిక్రాన్ దెబ్బ... రకుల్ బాలీవుడ్ ఆశలన్ని గల్లంతు?

సాధారణంగా కొంతమందికి ఇండస్ట్రీలో అవకాశాలు రాక వెనుకడుగు వేస్తుంటారు మరికొందరికి మాత్రం అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలన్న ఎంతో అదృష్టం ఉండాలి.

అలాంటి అదృష్టానికి చాలా దూరంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు.

ఈమె దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలో  ఏకంగా వరుస సినిమాలలో నటించి ఆ సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ గత రెండు సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ చేసి ఎటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్ అనే 4 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ పూర్తిచేసింది.

అయితే ఈ సినిమాలన్నీ కూడా విడుదల తేదీలను ప్రకటించి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వీటిపై ఒమిక్రాన్ దెబ్బ పడిందని చెప్పవచ్చు.ఇలా ఈ సినిమాలన్నీ వరుసగా విడుదలైతే తన పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోతోందని తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో కలలు కనింది.

అయితే రకుల్ ఆశలన్నీ అడియాసలుగా మిగిలిపోయాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా కారణంగా థియేటర్లు మరొకసారి మూతపడటంతో సినిమాలన్నీ మరోసారి విడుదల వాయిదా పడ్డాయి.ఇలా థియేటర్లు మూత పడిన క్రమంలో రకుల్ నటించిన ఈ సినిమాలు తిరిగి థియేటర్లో విడుదల అవుతాయా లేదా ఒటీటీలో విడుదలవుతాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తాజా వార్తలు