ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపిన ఒమన్...!!!

వలస కార్మికులు అత్యధికంగా ఉపాది పొందే అరబ్బు దేశాలలో ఒకటైన ఒమన్ అక్కడి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

అంతేకాదు ఒమన్ వెళ్లాలనుకుంటున్న వలస వాసులకు తాజాగా ఒమన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.

తమ దేశంలోకి రావాలనుకునే వారు ఇకపై ఉపాది కోసం ఇచ్చే వీసా ఫీజుల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని ఫీజుల చెల్లింపులో భారీగా తగ్గింపు ఇస్తున్నట్టుగా ఒమన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఇకపై ఉపాది పొందే వీసాలకు, రెన్యువల్ వీసాలకు ఫీజులు భారీగా తగ్గించింది.

అంతేకాదు ఒమానిజేషన్ పాలసీకి కట్టుబడి ఉన్న కంపెనీలకు అయితే ఈ తగ్గింపు సుమారు 85 శాతం ఉంటుందని ఒమన్ కార్మికశాఖ వెల్లడించింది.కాగా కార్మికుల విషయంలో కేటగిరి వారిగా ఫీజుల తగ్గింపు ఉన్నట్లుగా తెలుస్తోంది.ఫస్ట్ క్లాస్ ప్రొఫెషన్ కి చెందిన వారికి ఫీజులు రూ.60 వేలుగా నిర్దారించగా గతంలో ఇదే కేటగిరిలో ఫీజు సుమారు రూ.4 లక్షలు ఉండేది.అయితే.ఒమానిజేషన్ పాలసీకి కట్టుబడి ఉన్న కంపెనీలకు చెందిన వారైతే కేవలం ఫీజు రూ.42 వేలు చెల్లిస్తే సరిపోతోంది.ఇదిలాఉంటే ప్రత్యేకమైన స్థానాలు, సాంకేతిక కేటగిరి వారికి వీసా ఫీజు రూ.51 వేలు గా నిర్ధారించింది.కాగా గతంలో ఇదే కేటగిరిలో ఫీజు సుమారు రూ.2 లక్షలు ఉండేదట ఇదే కేటగిరికి చెందిన వారు ఒమానిజేషన్ పాలసీకి కట్టుబడిన కంపెనీలకు చెందిన వారైతే వారు కేవలం రూ.35 వేలు చెల్లిస్తే సరిపోతుంది.నైపుణ్యం లేని ఉద్యోగాలకు చెందిన వారైతే రూ.42 వేలు చెల్లిస్తే సరిపోతుంది.ఇదే ఫీజు గతంలో రూ.60 వేలుగా ఉంది కానీ ఇదే కేటగిరికి చెందిన ప్రవాసులు ఒమానిజేషన్ పాలసీను పాటించే కంపెనీలకు చెందిన వారైతే వారు కేవలం రూ.28వేలు చెల్లిస్తే సరిపోతుంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు