అలనాటి బాలివుడ్ నటి రేఖా ఇక్కడ అందరికి తెలుసుగా.అయినా పరిచయం అక్కరలేని పేరు అది.
అప్పట్లో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల చప్పట్లు, యువకుల హృదయాలు, రెండు సంపాదించిన రేఖా జీవితం, తెరపై ఉన్నంత అందంగా నిజజీవితంలో లేదట.తొలినాళ్ళలో రేఖా పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావట.
ఆ కష్టాల్లో ఒకటి ఇటివలే వెలుగులోకి వచ్చింది.
టీనేజ్ లోనే సినిమాల్లోకి వచ్చిన రేఖా 15 ఏళ్ళ వయసులో ఉండగా “అంజానా సఫర్” అనే సినిమాలో బిస్వాజీత్ సరసన నటించింది.
ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశం ఉన్నట్లుగా రేఖాకి ఎప్పుడు చెప్పలేదట.ఓరోజు హీరో బిస్వాజీత్, దర్శకుడు కుల్జీత్ పాల్ ముందే మాట్లాడుకోని రేఖపై లైంగికంగా దాడికి ప్లాన్ చేశారు.
స్క్రిప్టులో లేని ముద్దు డైరెక్టర్ యాక్షన్ అనగానే మొదలైంది.అసలు హీరో తన పెదాల్ని ఎందుకు ముద్దాడుతున్నాడో అర్థం కాక, అయోమయంలో పడిపోయింది 15 ఏళ్ళ రేఖ.ఏకంగా 5 నిమిషాలపాటు నిర్విరామంగా రేఖను ముద్దుపెట్టుకున్నాడట ఆ హీరో.డైరెక్టర్ అంతసేపు కట్ చెప్పనేలేదు.
ఆమెకు అప్పుడు అర్థం అయ్యింది తనపై ఎలాంటి రాక్షస చర్య ప్లాన్ చేసారో.
రేఖ జీవిత చరిత్రపై వచ్చిన పుస్తకం “రేఖా – ది అన్టోల్డ్ స్టోరి” లో ఈ ఘటన యొక్క ప్రస్తావన వచ్చుంది.







