మహేష్ బాబు రికార్డుల మోత మొదలైంది

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నెల 24 తేదివరకు అక్కడే షూటింగ్ పాల్గొని, ఆ తరువాత నూతన సంవత్సర వేడుకల కోసం ఫ్యామిలితో పాటు విదేశాలకు బయలుదేరుతాడు మహేష్.

 Mahesh 23 Record Hunt Begins With A Bang-TeluguStop.com

ఇక విషయంలోకి వెళితే, ఇప్పటిదాక మనం విన్నట్లుగా, మహేష్ 23 శాటిలైట్ హక్కులు 26 కోట్లకే అమ్ముడుపోలేదట.సర్వీస్ ట్యాక్స్ కలిపి 30 కోట్లకు జీ సంస్థ తెలుగు – హిందీ టీవి రైట్స్ దక్కించుకుంది.

అయితే సర్వీస్ ట్యాక్స్ తీసేస్తే, మళ్ళీ అదే లెక్క.అంటే 26 కోట్లు.

ఏరకంగా చూసిన ఓ భారి రికార్డు.తమిళ వెర్షన్ శాటిలైట్ కలుపుకోని ఈ చిత్రం కేవలం శాటిలైట్ హక్కలు ద్వారానే 38-40 కోట్లు రాబట్టవచ్చు.

మరో వార్త ఏంటంటే, సంభవామి అనే టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదంట.ఏజెంట్ శివ లాగే ఇది కూడా పరిశీలిస్తున్న టైటిల్స్ లో ఒకటి.

జనవరి ఒకటొవ తేదిన సినిమా పేరు ఖరారు చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా బిజినెస్ 150 కోట్ల దాకా వెళుతుందని ఇప్పటికే తెలుగుస్టాప్ వార్తను అందించింది.

రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ గా, ప్రముఖ తమిళ హీరో భరత్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.ఈ భారి ద్విభాష్ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube