అఫీషియల్.. ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైన కల్కి..

ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న కల్కి సినిమా( Kalki 2898 AD ) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 22 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ విషయాన్ని తాజాగా ఓటిటి పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ నేపథ్యంలో ఓ పోస్టర్ విడుదల చేస్తూ విషయాన్ని తెలియజేసింది.

అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని పోస్టర్ ద్వారా తెలుస్తోంది.అయితే హిందీ వర్షన్ మాత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ లో కూడా ఆగస్టు 22న స్ట్రీమింగ్ అవ్వబోతోంది.

ఇకపోతే కల్కి సినిమాలో స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) మెయిన్ రోల్ లో నటించగా.ప్రముఖ నటులు కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే ఇంకా ఎందరో ప్రముఖ తారాగణం నటించారు.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1200 కోట్ల రూపాయలపైగా వసూళ్లను రాబట్టింది.

Advertisement

ఇందులో భాగంగా ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ కల్కి 2 సినిమాపై పడింది.ఇక ఈ సీక్వెల్ సినిమాపై ఇప్పటికే దర్శకుడు నాగ అశ్విన్ ( Nag Ashwin )కొన్ని వ్యాఖ్యలు చేశారు.

కల్కి 2 సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించామని.సినిమాలో 20% వరకు పూర్తి చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.ముఖ్యంగా హీరో ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను ఇంకా తెరకెక్కించాలని ఆయన చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా సినిమాలోని కర్ణుడు, యాస్కిన్ అశ్వద్ధామ పాత్రలకు సంబంధించి ఎంతో కీలకమైన ధనస్సు గురించి సన్నివేశాలు ఉండనున్నట్లు ఆయన చెప్పగానే చెప్పేశారు.ఇకపోతే కల్కి మొదటి పార్ట్ లో కమలహాసన్ నటించిన యాస్కిన్ పాత్రకు పెద్దగా ఆస్కారం లేకపోయినా.

అదే రాబోయే సినిమాలో మాత్రం ఆయన పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుందని హీరో కమలహాసన్ ఇదివరకు ఓ కార్యక్రమంలో తెలియజేశారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు