అధికారులు జవాబీదారుగా పని చేయాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికారులు జవాబీదారుగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.రానున్న ప్రజావాణిలో ఏ ఏ శాఖ వద్ద ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయో తెలుపాలని ఆదేశించారు.

ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులు రెవెన్యూ 35 సెస్ 208 డీఎంహెచ్ఓ కార్యాలయం 2 డీపీఓ కార్యాలయం 10సర్వే కార్యాలయం 4డీసీఎస్ఓ కార్యాలయం 1 సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం 14 ఎస్పీ కార్యాలయం 1డీడబ్ల్యూఓ కార్యాలయం 2ఉపాధి కల్పన కార్యాలయం 15 ఎస్డీసీ కార్యాలయం 4ఎంపీడీవో కార్యాలయం కోనరావుపేట 2ఎంపీడీవో కార్యాలయం తంగళ్లపల్లి 4 ఎంపీడీవో కార్యాలయం ఇల్లంతకుంట, వేములవాడ ఒకటి చొప్పున డీసీఓ బీసీ కార్యాలయం, ఎల్డీఎం, డీఆర్డీఓ, ఇరిగేషన్, వేములవాడ మున్సిపల్, ఎక్సైజ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒకటి చొప్పున వచ్చాయి.మొత్తం 312 దరఖాస్తులు వచ్చాయి.

ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
వీడియో: అట్లాంటిక్ మహాసముద్రంలో రాకాసి గాలి.. క్రూయిజ్ షిప్ దాదాపు పడిపోయింది..!!

Latest Rajanna Sircilla News