ఇటలీ ప్రధాని భద్రతాధికారిని కూడా వదలని కరోనా,మృతి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా ఎవర్ని కూడా వదిలిపెట్టడం లేదు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలు కరోనా పాజిటివ్ కేసులు దాటగా, 60 వేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

చైనా లో తొలిగా పురుడుపోసుకున్న ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ముఖ్యంగా అమెరికా,యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తుంది.ఈ కరోనా వల్ల ఇప్పటికే ఇటలీ,స్పెయిన్,అమెరికా లలో అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.ఇటలీ ప్రధాని భద్రతాధికారుల్లో ఒకరైన జార్జియో గుస్తామాచియా కు కూడా కరోనా దెబ్బకు చివరికి ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలుస్తుంది.52 ఎల్లా జార్జియో గత నెల మార్చి 21 వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించగా వెంటనే ఆయన్ను ప్రధాని భద్రతా విభాగానికి సంబందించిన విధుల నుంచి తప్పించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడం తో శనివారం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

అయితే ఇటలీ ప్రధాని గియు సెప్ కాంటే కు గత రెండు వారాలుగా జార్జియో దూరంగా ఉంటున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.అయితే గత నెలలో ఆయనకు పాజిటివ్ అని తేలడం తో వెంటనే ముందస్తు జాగ్రత్తగా ప్రధానికి సైతం కరోనా టెస్టులు నిర్వహించగా ఆయన నెగిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు, గత కొద్దీ రోజులుగా జార్జియో కు ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడం తో శనివారం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్
Advertisement

తాజా వార్తలు