ఈ సీఎంను చూసి నేర్చుకోండి!

ఒక్క సారి ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి తర్వాత పది తరాల కుటుంబ సభ్యులు దర్జాగా కూర్చుని తినవచ్చు అని అంటూ ఉంటారు.

ముఖ్యమంత్రి ఏంటి ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎన్నికయిన వారు కూడా వేల కోట్లు వెనకేసుకుంటున్న వారు ఉన్నారు మనదేశంలో.

ఒక చిన్న ఊరు సర్పంచి కూడా లక్షల్లో సంపాదిస్తున్నాడంటే ఇక ముఖ్యమంత్రి ఎంత సంపాదించవచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే అందరిలా తాను కాదంటున్నాడు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌.

ప్రజా ప్రతినిధులు ప్రజల ఆస్తులను దోచుకుంటూ, తమ ఆస్తులను పెంచుకుంటున్నారు.కాని నవీన్‌ పట్నాయక్‌ మాత్రం తనకు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తిని కూడా ప్రభుత్వానికి రాసి ఇచ్చి దేశం దృష్టిని ఆకర్షించారు.

తన తండ్రికి చెందిన 10 కోట్ల విలువైన ఆస్తిని స్వయంగా రిజిస్టేన్‌ ఆఫీసుకు వెళ్లి ప్రభుత్వం పేరున రిజిస్ట్రర్‌ చేయించాడు.నవీన్‌ పట్నాయక్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Advertisement

అందరు ప్రజా ప్రతినిధులు కూడా నవీన్‌ పట్నాయక్‌ను చూసి నేర్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు

Advertisement

తాజా వార్తలు