దారుణం: మంటల్లో కాలి బూడిదైన ఇద్దరు చిన్నారులు...

ఒడిషా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లా మైనపొదర్ గ్రామంలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు దారుణంగా కాలి బూడిదైన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు వారి కుటుంబంతో నివసిస్తున్నారు.

వారికి ఎలీన, సుజాత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.వీరికి సుమారు నాలుగేళ్ల వయస్సు ఉంటుంది.

అయితే వీరి ఇల్లు మొక్కజొన్న తోటకు సమీపాన ఉంటుంది.దీంతో అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఆ తోటలో ఆడుకుంటున్నారు.

అయితే ఉన్నట్లుండి మొక్కజొన్న తోటకు నిప్పు అంటుకుంది.దీంతో చిన్నారులు ఇద్దరూ మంటల నుండి బయటకు రాలేక అందులోనే ఉండి సజీవదహనమయ్యారు.

Advertisement

అయితే ఇది గమనించిన చుట్టుపక్కల స్థానికులు నీళ్లతో మంటలను ఆర్పినా అప్పటికే తీవ్ర గాయాలు అయ్యి చిన్నారులు ఇద్దరు మృతి చెందారు. 

దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతుళ్లు చనిపోవడంతో ఆ కుటుంబం బోరున విలపించింది.అలాగే ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.అయితే ఈ ఘటనలో చిన్నారులను ముందుగా గమనించిన ఎటువంటి వారి మేనత్త బసంత వారిని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె తీవ్ర గాయాలు పాలయ్యింది.

దీంతో చుట్టుపక్కల స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తమై దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు